Ilaiah Paityam ( Telugu )

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

40.00

5 in stock

Compare

Description

ఐలయ్య పైత్యం

నేను హిందువునెల్లయిత ‘పుస్తకంపై ఎం.వి.ఆర్‌.శాస్త్రి 2000 సంవత్సరంలో ఆంధ్రభూమి దినపత్రికలో వరసగా రాసిన సంచలన సమీక్ష ఇప్పుడు పుస్తకరూపంలో’

‘హిందూమతానంతర భారతదేశం’ పై ఇటీవలి విమర్శనాత్మక వాసాలతో కలిపి!! – ఐలయ్య పైత్యం

పేజీలు : 73; Publisher : Durga Publications; Pages 73.

A Rejoinder to Kancha Ilaiah’s ” Why I am Not a Hindu” .

1 review for Ilaiah Paityam ( Telugu )

 1. 5 out of 5

  :

  ఘజిని , ఘోరీలు చేయలేని పనిని, అంతెందుకు ఔరగంజేబు కూడాచేయలేక పొయిన పనిని ఈ దేశం లో కొందరు స్వయంప్రకటిత మేధావులు చేస్తున్నారు.

  చదవడానికే ఎబ్బెట్టు గా ఉంది కదూ, కానీ ఇది నిజం .

  ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని కాలరాయాలి , మన మతమే ఉండాలి , హిందూ మతం ఉండకూడదు, అన్న సంకల్పం ఆ ముష్కరుల లోను ఈ స్వయం ప్రకటిత మేధావులలోను స్పష్టం గా కనబడుతుంది. ఐతే వారు కత్తిని వాడి విఫలమయ్యారు, ఈ స్వయంప్రకటిత మేధావులు కలం వాడి సఫలమవుతున్నారు.

  ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఐలయ్య అందరికీ సుపరిచితమైన పేరే , బ్రాహ్మణులను ఫాసిష్టులని, కోమట్లను సామాజిక స్మగ్లర్లని ఇష్టం వచ్చినట్లు తన పుస్తకం లో వ్రాసారు ఈ స్వయం ప్రకటిత మేధావి. “నేను హిందూ ఎట్ల ఐతా”, “హిందూ మతాంతర భారత దేశం” పుస్తకాల ద్వారా ఆయన హిందువుల పైన తన ద్వేషాన్ని చూపించుకున్నారు. పైపెచ్చు టీ వీ చర్చల్లో తానేదో బాగా పరిశోధన చేసి ఇవి వ్రాసినట్టు చెప్తారు ఆయన.

  ఏ విషయమైనా తర్కానికి నిలబడాలి కదా, మరి అలాంటప్పుడు ఐలయ్య వ్రాసిన వ్రాతలు తర్కానికి నిలబడతాయా ? అసలు ఆయన చేసిన పరిశోధన ఏమిటి ? ఆయన చేసేది తార్కిక ప్రతిపాదనా లేక కేవల భావజాల వ్యాప్తా ? హైందవ సమాజం ఈ విషయాల పై దృష్టి పెట్టి పరిశోధన చేసి ఐలయ్య లాంటి వారి నోరు మూయించాలి. దురదృష్ట వశాత్తూ హైందవ సమాజం ఇటువంటి పనులు చేయటం లేదు.

  శ్రీ ఏం.వి.ఆర్ శాస్త్రి గారు “ఐలయ్య పైత్యం” పుస్తకం ద్వారా ఇటువంటి కుహనా మేధావులను ఎలా ఎదుర్కోవాలో, వారి అబధ్ధాలను ఎలా ఎండగట్టాలో అద్భుతం గా చూపారు.

  ఐలయ్య నిష్పాక్షికం గా పరిశొధన సలుప లేదని, కాబట్టి ఇది కేవలం భావజాల వ్యాప్తి కోసం వ్రాసుకున్న పుస్తకం అని నిరూపించడానికి శాస్త్రి గారు పూర్తి హేతుబధ్ధమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

  మొదట వ్యాసం లో అసలు బ్రహ్మ కీ విష్ణువుకూ కూడా తేడా తెలియకుండా ఐలయ్య వ్యాఖ్యానం ఎలా వ్రాసారో, బ్రాహ్మణుల గురించి కనీస విషయాలు తెలియకుండా వారిపై పరిశోధనా వాక్యాలు ఎలా వ్రాశారో మనకి చూపెడతారు శాస్త్రి గారు. ఐలయ్య వ్రసిన ప్రతిమాటను రెఫరెన్సు తో సహా చూపి అది తప్పు ఎలా అవుతుందో కూడా చెప్తారు.

  రెండవ వ్యాసం లో ఐలయ్య అమ్మ సరస్వతీ దేవి పైన , శ్రీ కృష్ణుల వారి పైన చేసే అసంబద్ధపు వ్యాఖ్యలను ఖండిస్తారు శాస్త్రి గారు.
  మూడవ వ్యాసం లో ఐలయ్య చేసే మరొ అబద్ధపు వ్యాఖ్య పొచమ్మ తల్లి మీద, ఇక్కడ పోచమ్మ కథ మొత్తం చెప్పి శాస్త్రి గారు ఐలయ్య వ్యాఖ్య లను ఖండిస్తారు , అలాగె ఐలయ్య వల్లె వెసే బహుజన – బహుజనేతర దేవతల థియరీ ని తూర్పార బదతారు. అలాగె అసాది కులం ఎల వచ్చింది , బలి అచారం ఎలా వచ్చిందనే విషయాలు చాలా చక్కగా వివరించారు శాస్త్రి గారు.

  తరువాత వ్యాసాలలో ఐలయ్య కనీసం అంబేద్కర్ గారిని కూడా సరిగా అధ్యయనం చేయలేదన్న విషయాన్ని మనకు చూపుతారు. ఆ తరువాత ఐలయని పట్టిన ఆ బ్రహ్మ రాక్షసుడు ఎవరో ఆయన పుస్తకాలు చదివేటప్పుడు మనం ఎం గుర్తుపెట్టుకోవాలో చెప్పకనే చెప్తారు శాస్త్రి గారు.

  హిందూ మతం పైన ఏమాత్రం అభిమానం ఉన్నా మనం ఖచ్చితం గా చదవవలసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం చదవడమే కాదు, శాస్త్రి గారిలా మనం కూడా ఈ దేశం , మన సంస్కృతి , హైందవం యొక్క మూలాలను తెలుసుకొని ఐలయ్య వంటి స్వయం ప్రకటిత మేధావుల నిజ స్వరూపం బట్టబయలు చేయాలి.

  ఈ పుస్తకం వ్రాసినందుకు శాస్త్రి గారికి మనస్ఫూర్తి గా కృతజ్ఞతలు , అందరు దయచేసి ఒక రెండు గంటలు వెచ్చించి ఈ పుస్తకం చదవండి.

Add a review